Narayana Educational Institutes : జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు (Narayana Educational Institutions) మరోసారి సత్తాచాటాయి. ఇటీవల వెల్లడైన జేఈఈ మెయిన్-2025 సెషన్-1 (JEE Main 2025 Session-1) ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బాని బ్రాత మాజీ (Bani Brata Majee) అనే విద్యార్థి 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించాడు. మాజీ అంకితభావం, నారాయణ గ్రూప్ అకడమిక్ అప్రోజ్ కారణంగానే అది సాధ్యమైందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ (Sindhura Narayana) అన్నారు.
బాని బ్రాత మాజీతోపాటు ఆయుష్ సింఘాల్ (Ayush Singhal), కుశాగ్ర గుప్తా (Kushagra Gupta), విశాద్ జైన్ (Vishad Jain), శివెన్ వికాస్ తోస్నివాల్ (Shiven Vikas Toshniwal) అనే విద్యార్థులు కూడా 100 పర్సంటైల్ సాధించారు. బాని బ్రాత మాజీ తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా, ఆయుష్ సింఘాల్ రాజస్థాన్ రాష్ట్ర టాపర్‌గా, కుశాగ్ర గుప్తా కర్ణాటక రాష్ట్ర టాపర్‌గా, విశాద్ జైన్ మహారాష్ట్ర టాపర్‌గా నిలిచారు. అదేవిధంగా పియూష గోయెల్ అనే విద్యార్థి పంజాబ్‌లో, ఆర్నవ్ జిందాల్ చండీగఢ్‌లో, సునయ్ యాదవ్ తమిళనాడులో హయ్యెస్ట్ స్కోరర్లుగా ఉన్నారు.
తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని సింధూర నారాయణ అన్నారు. నారాయణలో కేవలం విద్యా బోధన మాత్రమే చేయమని, విద్యార్థులు సాధికారత సాధించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునే ట్రిక్కులను, సవాళ్లను ఎదుర్కోవడమెలా అనేవి నేర్పిస్తామని తెలిపారు. నారాయణ విద్యాసంస్థల మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల విజయంలో తమ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఎన్‌లెర్న్ (nLearn) పాత్రను హైలెట్ చేశారు.
nLearn విద్యార్థుల ప్రిపరేషన్ గతినే మార్చేసిందని శరణి నారాయణ చెప్పారు. తమ ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకుంటూ ఏ విద్యార్థి కూడా వెనుకబడకుంటా చూసుకుంటారని తెలిపారు. మరో డైరెక్టర్ పునీత్ కొతప మాట్లాడుతూ.. ఇప్పుడు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్-2025పై దృష్టి సారించినందున వారి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. నారాయణ విద్యాసంస్థలు ఇదే విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
Abhinav Singh | ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దు: సుప్రీంకోర్టు
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం