నర్సాపూర్ : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నర్సాపూర్ బీవీఆర్ఐటీ (BVRIT ) కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీప్రసాద్ ( Director Lakshmi Prasad ) అన్నారు. కళాశాలలో జపాన్ కల్చర్‌ను ప్రతిబింభిస్తూ ఇమాజిన్ జపాన్ అనే పేయింటింగ్ పోటీని నిర్వహించారు. గ్రాడ్యూయేట్ స్టడీ అబ్రాడ్ సెంటర్ , జపనీస్ భాషా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 67 మంది విద్యార్థులు పాల్గొని జపాన్ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆవిష్కరణలను కాన్వాస్‌పై చిత్రీకరించారు.
ఈ కార్యక్రమానికి సాగా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ యుకియో నాగనో, కురుమే ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ జపాన్ ప్రత్యేక ప్రొఫెసర్ శుచి టోరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు విద్యాసంస్థల డీన్ డాక్టర్ రాజు ఏడ్ల, జీఎస్ఏసీ నుంచి ప్రణీత, జపనీస్ భాషా ఉపాధ్యాయురాలు లవీనా అరోరా, విభాగాధిపతులు, మేనేజర్ బాపిరాజు, టీఎల్ఎన్ సురేశ్, ఏవోలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బీవీఆర్ ఐటీ హ్యాకథాన్‌లో 50 జట్లు జాతీయ స్థాయికి ఎంపిక
బీవీఆర్ ఐటీ కళాశాలలో సెప్టెంబర్ 18, 19 తేదిల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2025లో మొత్తం 62 హార్డ్‌వేర్ , 300 సాఫ్ట్‌వేర్‌కు చెందిన వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించఆరు. ఈ జట్లలో 50 ఉత్తమ జట్లను జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2025లో పాల్గొనే అవకాశం లభించిందని డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.