నిర్మల్ అర్బన్ (సారంగాపూర్), ఫిబ్రవరి 3: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని మృతిచెందడం కలకలం రేపింది. సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన మహిత (11) ఉదయం స్నానానికి వెళ్లిన తర్వాత ఛాతి నొప్పి తీవ్రంగా ఉన్నదని ప్రిన్సిపాల్‌కు చెప్పగా ఆమె సూచన మేరకు హాస్టల్ ఏఎన్ఎం నిర్మల్ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడే బాలిక మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై కలెక్టర్ వరుణ్‌రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదిలావుండగా తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.