దేవరకొండ, ఏప్రిల్ 01 : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అలాగే ఉర్దూ మీడియం శిథిలమైన పాఠశాల/కళాశాలను అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ సమీర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, సీనియర్ నాయకులు నజీర్, మాజీ సర్పంచులు దొండేటి మల్లారెడ్డి, పాప నాయక్, రాజు నాయక్, నాయకులు సురేందర్ రెడ్డి, గిరి, ఏఈలు పాల్గొన్నారు.