Capital Amaravati | రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Capital Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ( Amaravati Capital Bill ) చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం (Lok Sabha Approves) తెలిపింది. బుధవారం పార్లమెంట్ సమావేశంలో బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు మినహా ఇతర పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు పలికారు. దీంతో అత్యధిక సభ్యుల మద్దతు ప్రకారం చైర్మన్ ఆమోదం తెలుపడంతో సభ్యులు హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ (YCP Walkout) చేశారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీసీ పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి ( MP Mithun Reddy ) తెలిపారు. రాజధానిని ఎప్పటివరకు నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి సుమారు 54 వేల ఎకరాలు సేకరించారని వెల్లడించారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని బీజేపీ సభ్యురాలు పురందరేశ్వరి అన్నారు. రాజధాని నిర్మాణానికి నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్టంగా ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాజధాని అంశం అస్థిరత ఏర్పడిందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం 29వేల మంది రైతులు తమ భూములనుఇచ్చేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

