Iran vs Israel : ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wallstreet Journal) సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా (Saudi Arabia), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సిద్ధమవుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నది. ఇరాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తుంటంతో.. యూఏఈ, సౌదీ దేశాలు అమెరికాతో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తున్నది.
ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంవల్ల యూఏఈ ఇప్పటికే చాలా నష్టపోయిందని, ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. అదేగనుక జరిగితే ఇరాన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న మొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలువనుంది. అదేవిధంగా గతంలో తన వైమానిక స్థావరాలను అమెరికా సైన్యం ఉపయోగించుకొనేందుకు అనుమతించని సౌదీ అరేబియా.. ప్రస్తుతం అందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.