– ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 29 : సివిల్ సప్లై హమాలీకు ప్రస్తుతం ఉన్న కూలీ రేట్లను రూ.33కు పెంచుతూ కమిషనర్ సమీక్షంలో జరిగిన చర్చల ఒప్పందాన్ని వెంటనే అమలు చేసి జిఓను విడుదల చేయాలని లేకుంటే సమ్మె తప్పదని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో జరిగిన సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశానికి ఇమ్రాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ రేషన్ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు కీలకంగా పనిచేస్తున్నప్పటికీ, వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. హమాలీలకు ప్రస్తుతం ఉన్న రేట్లను రూ.33కు పెంచాలని డిమాండ్ చేశారు.
హమాలీ రెట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కాకుండా ప్రతి నెలా 1వ తేదీన ఒక్కే సారి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, హమాలీలకు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, రిటైర్ అయినా హమాలీలకు పిఎఫ్, పెన్షన్ అందేల చర్యలు తీసుకోవాలన్నారు. సొంత గోదాముల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న కూలీ రెట్ల జీఓను రూ.33 పెంచుతూ కమిషనర్ జరిగిన చర్చల ఒప్పందం ను వెంటనే అమలు చేసి జీఓను విడుదల చేయాలని లేకుంటే నిరవధిక సమ్మె తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, నాయకులు గొరిగే శంకరయ్య, పిన్నం జగన్, పురుగుల రవి, బోదుల యాదయ్య, ముదిగొండ బసవయ్య, శ్రీనివాస్, గణేష్, జహంగీర్, స్వామి, మైసయ్య, జీడయ్య పాల్గొన్నారు.