మందమర్రి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ( Labour Codes) తక్షణమే రద్దు చేయాలని దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో ( General Strike) భాగంగా మందమర్రి ఏరియాలో సమ్మె విజయవంతమైంది. కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయాలని చూస్తున్న వాటిని ఉపసంహరించాలని జేఏసీ ( JAC ) నాయకులు డిమాండ్ చేశారు.
నల్ల చట్టాలు కార్మికుల హక్కులను హరించేలా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలగాలని జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. చికాగో అమరవీరుల త్యాగ ఫలితమే కార్మికుల 8 గంటల పని దినాన్ని కూడా మార్చాలని మోదీ ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వాణిజ్య వ్యాపార రంగంలో 10 గంటల పని దినాన్ని జీవో ఇవ్వడాన్ని కార్మికులు వ్యతిరేకించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్ ( TBGKS ) యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, గని ఫిట్ కార్యదర్శి వీరారెడ్డి, శివ నాయక్, బాబా పాల్గొన్నారు.