న్యూఢిల్లీ : పార్లే-జీ బిస్కెట్స్, చీజ్‌తో ఆమ్లెట్ (omelette with Parle-G biscuits) తయారుచేసిన స్ట్రీట్ ఫుడ్ విక్రేతపై ఇంటర్నెట్లో నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఫుడ్బంక్ అనే పేజ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా 1.3 కోట్ల వ్యూస్‌తో ఇది నెట్టింట తెగ వైరలవుతోంది.
ఈ ఆమ్లెట్‌ను తయారుచేసేందుకు వ్యాపారి రెండు ఎగ్స్‌ను పగులగొట్టి బౌల్లో వేయడంతో పాటు ఆనియన్స్, సాల్ట్, మసాలా కలిపి ఈ మిక్చర్‌ను ప్యాన్‌పై వేసి బటర్లో ఆమ్లెట్ వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఆపై ఆమ్లెట్ లేయర్‌పై పార్లే-జీ బిస్కెట్స్, చీజ్ వేయడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియోకు మోయే మోయే ఆమ్లెట్ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇదేం ఆమ్లెట్ అంటూ పలువురు నెటిజన్లు స్ట్రీట్ ఫుడ్ వెండర్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని తినడం కంటే చనిపోయేందుకే తాను మొగ్గుచూపుతానని ఓ యూజర్ కామెంట్ చేశారు. పలువురు యూజర్లు సైతం చిరు వ్యాపారిపై భగ్గుమన్నారు. అయితే ఇది ఆ వ్యాఖ్యాత తప్పుకాదని, ఇఆంటి కంటెంట్‌ను రికార్డు చేసిన ఫుడ్ వ్లాగర్లదే తప్పని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్‌కు బానిసే.. అతనెవరంటే?