మాగనూరు కృష్ణ : జిల్లా సరిహద్దు వద్ద శాశ్వత చెక్‌పోస్టుకు ( Permanent Check Post ) చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ( SP Dr. Vineeth) అన్నారు. అక్రమ రవాణా, నిషేధిత పదార్థాలు, దొంగతనాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలను అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ వద్ద పోలీసు బలగాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి సదుపాయాలు ఉండేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. శుక్రవారం కృష్ణ బోర్డర్ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
చెక్‌పోస్టు వద్ద నిరంతరం వాహనాల తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కృష్ణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, కేసుల రికార్డులు, జనరల్ డైరీ, తనిఖీ చేసి సిబంధికి ప్రతిరోజు రోల్ కాల్ తీసుకోవాలని, పక్కగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
100 కాల్స్ పట్ల వేగవంతంగా స్పందించాలని కోరారు. పోలీసులు క్రమశిక్షణతో పని చేస్తేనే ప్రజలలో పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతుందని గుర్తు చేశారు. సరిహద్దుల వద్ద అనుమానాస్పద వాహనాలు వ్యక్తులపై నిఘా ఉంచి అక్రమ వ్యాపారాలు అక్రమ రవాణా,ఈ తనిఖీల్లో మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై ఎస్ఎం నవీద్, పోలీసు సిబంది ఉన్నారు.