ENGW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) అదిరే బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో దక్షిణాఫ్రికా (South Africa)ను వణికించిన మాజీ ఛాంపియన్ పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఇంగండ్.. 69 పరుగుల ఛేదనను 15 ఓవర్లకే పూర్తి చేసింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్ (40 నాటౌట్), అమీ జోన్స్(18 నాటౌట్) దూకుడైన ఆటతో సఫారీ బౌలర్లకు దడ పుట్టించారు. అయబొంగ ఖాక ఓవర్లో బ్యూమంట్ సింగిల్ తీయడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని మూటగట్టుకుంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తొలి అడుగు ఘనంగా వేసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను వణికిస్తూ పది వికెట్లతో విజయం సాధించింది. లినే స్మిత్ (3-7) సంచలన స్పెల్‌తో సఫారీలను దెబ్బకొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్(2-5), చార్లీ డీన్(2-14)లు తలా రెండేసి వికెట్లతో మెరిశారు. దాంతో.. లారా వొల్వార్డ్త్ బృందం 69 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్లు అమీ జోన్స్(40 నాటౌట్), టమ్మీ బ్యూమంట్(21 నాటౌట్)లు అజేయంగా జట్టుకు విజయాన్ని అందించారు.
✅ First win on the board for England as they beat South Africa by 10-wickets!
Beaumont and Jones steered England to victory with the bat following an impressive performance from the bowlers.
👀 Next up: Bangladesh!
#HerGameToo x #CWC25 pic.twitter.com/ZR9xjBNd6x— Her Game Too Cricket (@HGTCricket) October 3, 2025
వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో ఇంగ్లండ్ బౌలర్లు పంజా విసిరారు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు. రెండో ఓవర్లోనే కెప్టెన్ లారా వొల్వార్డ్(5)ను లినే స్మిత్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు శుభారంభమిచ్చింది. ఆ తర్వాత.. తంజిమ్ బ్రిట్స్(5), సునే లుస్(2)లను బౌల్డ్ చేసిన స్మిత్ సఫారీలను దెబ్బతీసింది. అనంతరం.. మరినే కాప్ (4)సైతం పెవిలియన్ చేర్చిన ఆమె దక్షిణాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. టాపార్డర్ బ్యాటర్లు వెనుదిరుగుతున్నా సినాలో జఫ్తా(22) ఒంటరిపోరాటం చేసింది. కానీ, ఆమెను ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది.
South Africa bowled out for 69 — its 2nd lowest World Cup score! #ENGvSA #CWC25 LIVE score ➡️https://t.co/YRX2i6jFJF pic.twitter.com/cLIBkaTUWj
— Sportstar (@sportstarweb) October 3, 2025
మరో ఎండ్ నుంచి .. నాట్ సీవర్ బ్రంట్(2-5), చార్లీ డీన్(2-14) పోటీపడుతూ వికెట్ల వేట కొనసాగించి సఫారీలను ఆలౌట్ అంచున నిలిపారు. చివరి వికెట్ అయిన మలబా(3)ను డీన్ బౌల్డ్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ 69 పరుగులవద్ద ముగిసింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే మూడో అత్యల్ప స్కోర్. గతంలో.. 2009లో న్యూజిలాండ్‌పై 51కే ఆ జట్టు కుప్పకూలింది. పాకిస్థాన్‌పై 2019లో 63 రన్స్‌కే సఫారీ టీమ్ ఆలౌటయ్యింది. తక్కువ స్కోర్‌కు ఆలౌట్ కావడం ఇది మూడోసారి.