హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఓ సామాన్యుడి ప్రాణం తీశాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. చాంద్రాయన్ గుట్ట క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని కాంగ్రెస్ నాయకుడు అలీ మస్కటీ కుమారుడు TS 12 EA 8644 నెంబర్ కారుతో ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. కాగా రోడ్డు ప్రమాదం జరగగానే ఘటనా స్థలం నుంచి జారుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు ఆపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.