Chittoor | చిత్తూరు జిల్లా మూరకంబట్టులో ప్రియుడి ముందే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు కిశోర్, మహేశ్, హేమంత్‌ను శుక్రవారం నాడు పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు దాదాపు కిలోమీటర్ మేర నడిపించి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రజలు వారికి శాపనార్థాలు పెడుతూ, తిట్టారు. కాగా, నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మూరకంబట్టు సమీపంలోని నగరవనంలో ప్రేమికులు, సామాన్య ప్రజలు సేద తీరుతుంటారు. ఇలా గత నెల 25న ఓ ప్రేమికుల జంట సరదాగా మాట్లాడుకునేందుకు నగరవనం వచ్చారు. అయితే వీరిని టీడీపీ కార్యకర్తలైన ముగ్గురు యువకులు హేమంత్, మహేశ్, కిశోర్ టార్గెట్ చేశారు. ఆ ప్రేమ జంట వద్దకు వెళ్లిన యువకులు తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. ఆ ప్రేమ జంట సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి వాళ్ల తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు.
ఆ ముగ్గురులో ఒకరు ప్రేమజంటలోని అబ్బాయిని “మా మేడమ్ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారని’’ దూరంగా పిలుచుకొని వెళ్లగా మరో ఇద్దరు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ అమ్మాయి కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా , మరొకడు అత్యాచారం చేశాడు. ఇలా ముగ్గురు మార్చి మార్చి ఆ బాలికను రేప్ చేశారు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రేమజంట తమ కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో బాలిక స్వగ్రామం బండపల్లి వారికి తెలిసి నగరవనం దగ్గర కాపుకాశారు. నిన్న మధ్యాహ్నం ఆ కామాంధులను గుర్తించి ఆ ముగ్గురికి దేహశుద్ధి చేయగా ఒకడు తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించారు. కాగా మిగిలిన నిందితుడిని కూడా నిన్న గుడిపాల రోడ్డులో అరెస్టు చేశారు. కాగా, నిందితుప్రి ప్రేమికులు కనిపిస్తే వారిని వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించేవారని పోలీసులు తెలిపారు. ప్రేమికుల నుంచి డబ్బు, నగదు తీసుకుని వేధించేవారని.. అమ్మాయిలను శారీరకంగా కూడా అనుభవించేవారని పేర్కొన్నారు.
కానీ.. నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో రాజీ కోసం టీడీపీ కార్పొరేటర్ నవీన్ కుమార్ రంగంలోకి దిగి బెదిరింపులకి దిగాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు వెనకడుగు వేశారు. ఈ సాకుతో పోలీసులు చేతులు దులుపుకునేందుకు యత్నించారు. అయితే ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలి ఇంటికెళ్లిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని వన్ స్టాఫ్ సెంటర్ తరలించారు. బాధితురాలు మైనర్ కావడంతో గ్యాంగ్ రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు పెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కేసుకు రాజకీయ రంగులు పులమొద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు.
చిత్తూరు: చిత్తూరు ఓల్డ్ డిపిఓ నుంచి జిల్లా కోర్టు వరకు నిందితుల్ని చేతులకు బేడీలు వేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.
దాదాపు కిలోమీటర్ మీద రోడ్డుపై నడిపించి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు.
నిందితులను చూసేందుకు రోడ్డుపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపిన ప్రజలు.#Chittoor #APNews… pic.twitter.com/f13NAGCvdE
— TV9 Telugu (@TV9Telugu) October 3, 2025