జడ్చర్లటౌన్/తిమ్మాజిపేట/వనపర్తి టౌన్, అక్టోబర్ 1 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ(94) హైదరాబాద్‌లో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కి ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, మా జీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల, ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకొని లక్ష్మమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మారెడ్డిని కేటీఆర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లి లక్ష్మారెడ్డిని పరామర్శించారు. ఈనెల 3న తిమ్మాజిపేట మండలం ఆవంచలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఆమెకు లక్ష్మారెడ్డితోపాటు మరో ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మారెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ మరణం బాధాకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతా పం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతు డు కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.