Tiger Safari | నల్లమల ఫారెస్ట్ అనంగనే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కదా ఇక్కడికి ఎవరిని రానివ్వరు అనుకుంటారు. కానీ… నల్లమల ఫారెస్ట్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. తెలంగాణ టూరిజం డిపార్ట్ సహకారంతో నల్లమల నైట్ లైఫ్ సఫారిని చూడొచ్చు. దేశంలో రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. దాదాపు 2611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అడవిలో పులలతో పాటు ఇంకా ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. దీన్ని అమ్రాబాద్ పులుల అభయారణ్యం అనికూడా పిలుస్తారు. పెద్దపులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవిలో టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. అక్టోబర్ 1 నుంచి టైగర్ సఫారి తిరిగి ప్రారంభమయింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టైగర్ సఫారీ ప్యాకేజీ ధరలు స్వల్పంగా పెరిగాయి. టైగర్ సఫారీలో ఎలాంటి ప్రదేశాలు చూడొచ్చు. ఈ టూర్‌కి ఎంత సమయం పడుతుంది. టూర్ ప్యాకేజీ, కాటేజ్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. వీడియో పబ్లిష్ అయినప్పటికీ ఇప్పటికీ ధరల విషయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు గమనించగలరు.
Tiger Safari Video