కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు.
సోమవారం తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలోకి రాగానే ఆలయం గేటు తెరిచి ఉండడంతో.. చోరీ జరిగిన విషయాన్ని ఎస్సై రవికుమార్ కు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీకి గురైన విగ్రహాల గురించి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తో పాటు కౌటాల సీఐ బుద్దేస్వామి, టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆలయాన్ని పరిశీలించారు.
ఆలయంలోని దాదాపు 800 ఏండ్ల నాటి పురాతన వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, మూడు ఉత్సవ విగ్రహాలు చోరీకి గురైనట్లు ద్రువీకరించారు. అనంతరం పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ లతో తనిఖీ నిర్వహించారు.
వేంకటేశ్వర ఆలయం లో విగ్రహాల ను దొంగతనం చేసిన నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు.