ములుగు : ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) శ్రువారం గుడి ప్రాంగణంలో చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తొందర్లోనే పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులు విశ్వాసం, నమ్మకంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారని, వారి విశ్వాసం దెబ్బ తీయకుండా ఆదివాసీల అస్తిత్వం కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తాం అని అన్నారు. ముస్తాబవుతున్న పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పరిశీలించారు.
అనంతరం జంపన్న వాగు, స్తూపం నుండి బస్టాండ్ వరకు జరిగే రోడ్ల విస్తరణ ను పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది, సుందరీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేశాం అని, మేడారంకు వచ్చే భక్తులకు ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయాలి అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. వారి వెంట పరిశీలించారు. ఎంపీ బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.