హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రస్థాయి జూడో టోర్నమెంట్ కం సెలక్షన్ హనుమకొండలోని బాక్సింగ్ హాలులో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథులుగా హనుమకొండ డీఈవో లింగాల వెంకట గిరిరాజ్ గౌడ్, డీసీఈబీ సెక్రెటరీ బి. రాందాన్, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సదానందం పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఈవో వెంకటగిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక, శారీరక పెరుగుదల జరుగుతుందని, ఇక్కడ పాల్గొన్న క్రీడాకారులు జాతీయస్థాయికి వెళ్లి తెలంగాణకు అత్యధిక పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రందాన్ మాట్లాడుతూ.. జూడో క్రీడా సెల్ఫ్ కాన్ఫిడేషన్ పెంచుతుందని దీని ద్వారా మన దేశంలో నుంచి చాలామంది ఒలింపిక్స్‌లో వెళ్లారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, మూడురోజుల పాటు పోటీలు జరుగుతాయని ఎస్జీఎఫ్ సెక్రెటరీ ఈ. ప్రశాంత్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో టీజీపేట హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎస్ పార్థసారథి, రాష్ర్ట అసోసియేట్ ప్రెసిడెంట్ భోగి సుధాకర్, వాలీబాల్ అసోసియేషన్ బాధ్యులు టి.రాముడు, జూడో కన్వీనర్ ఎం.సురేశ్ బాబు, కో- కన్వీనర్ కే.నిశాంత్ పాల్గొన్నారు.