
ఉప్పల్/ మల్లాపూర్/ చర్లప్ల, నవంబర్ 22 : ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం నాచారంలోని సీడీఎస్ భవనంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండవ డోసు వేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్, గ్రేటర్ టీఆర్ఎస్ నేత సాయిజెన్ శేఖర్, ఏసీపీ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, నాచారం డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, యూ త్ అధ్యక్షుడు దాసరి కరుణ, నేతలు శ్రీరామ్ సత్యనారాయణ, శివకుమార్, రాంచందర్, కట్ట బుచ్చన్న, శంకర్, భూపాల్‌రెడ్డి, మనోజ్, సాంబశివరావు పాల్గొన్నారు. అదేవిధంగా మల్లాపూర్ డివిజన్లోని బాబానగర్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రూప, నాగరాజు, భాస్కర్, నయీమ్, నేతలు పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లో…
చిలుకానగర్ డివిజన్లో చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్‌ను స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అజ్మత్నగర్, హైకోర్టుకాలనీ, రాఘవేంద్రకాలనీ, సీతారామకాలనీ, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటిం చారు. కార్యక్రమంలో నాయకులు బన్నాల ప్రవీణ్ ముది రాజ్, నర్సింహ, కొండల్‌రెడ్డి, రాంరెడ్డి, జగన్, నారాయణరెడ్డి, శేఖర్, శ్రీనివాస్ మహేందర్, శ్యామ్ పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలో..
చర్లపల్లి డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ కమ్యూనిటీహాల్, నెహ్రూనగర్, జేకేనగర్, శివసాయినగర్, విరాట్‌నగర్, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వ్యా క్సినేషన్ కేంద్రాలను కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సందర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, ఏఈ సత్యలక్ష్మి, నేతలు బాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, బాబు గంగపుత్ర, శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.