పండగ పూటా పస్తులేనా?.. మూడు నెలలుగా జీతాల్లేక బస్తీ దవాఖానల సిబ్బంది అవస్థలు
వైద్యారోగ్యశాఖలోని బస్తీ దవాఖానల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానల్లో 476 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు 350 మంది, సపోర్టింగ్ స్టాఫ్ 400 మంది పనిచేస్తున్నారు. వీరికి సర్కార్ మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, రోజువారీ సరుకుల కొనుగోలు, రవాణా ఖర్చులు కష్టంగా మారాయని వాపోతున్నారు. ఈ నెలలో దసరా పండగ ఉండగా.. జీతాలు రాకపోవడంతో పండగ జరుపుకొనేది ఎలా? అని ఆందోళన చెందుతున్నారు.
బస్తీ దవాఖానల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మండిపడుతున్నారు. పెండింగ్ జీతాల చెల్లింపు విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి అపాయింట్మెంట్కు ప్రయత్నించినా దొరకడం లేదని పలువురు ఉద్యోగులు వాపోయారు. ఇక ఉన్నతాధికారుల దృష్టికి వేతనాల సమస్య తీసుకెళ్తే.. కంటిన్యూయేషన్ ఆర్డర్ లేదని, బడ్జెట్ లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యులకు జీతాలు చెల్లించని పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

