హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేశ్ అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఖమ్మం జిల్లా యోనెకుంట తండాకు చెందిన నగేశ్ మృతిపై ఢిల్లీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి సభావత్ కల్యాణ్ ఫిర్యాదును స్వీకరించిన ఎస్టీ కమిషన్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
నగేశ్ మృతి కేసులో చేపట్టిన చర్యలు, ఆ కేసు పురోగతి వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. తమ నోటీసులకు సరైన సమాధానం రాకపోతే, సివిల్ కోర్టు అధికారాలతో సమన్లు జారీ చేసి, విచారణకు పిలిపిస్తామని కమిషన్ హెచ్చరించింది.