బానోత్ నగేశ్ మృతిపై ఎస్టీ కమిషన్ విచారణ.. సైబరాబాద్ సీపీకి నోటీసులు
హైదరాబాద్ మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేశ్ అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేశ్ అనుమానాస్పద మృతిపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఖమ్మం జిల్లా యోనెకుంట తండాకు చెందిన నగేశ్ మృతిపై ఢిల్లీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి సభావత్ కల్యాణ్ ఫిర్యాదును స్వీకరించిన ఎస్టీ కమిషన్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
నగేశ్ మృతి కేసులో చేపట్టిన చర్యలు, ఆ కేసు పురోగతి వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. తమ నోటీసులకు సరైన సమాధానం రాకపోతే, సివిల్ కోర్టు అధికారాలతో సమన్లు జారీ చేసి, విచారణకు పిలిపిస్తామని కమిషన్ హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

