హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మహిళల సీనియర్ టీ20 జట్టులో కరీంనగర్ చెందిన యువ ప్లేయర్ కట్ట శ్రీవల్లి చోటు దక్కించుకుంది. గ్వాలియర్(మధ్యప్రదేశ్) వేదికగా ఈనెల 8 నుంచి మొదలయ్యే బీసీసీఐ టీ20 టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) 15 మందితో జట్టును ప్రకటించింది. నిలకడగా రాణిస్తున్న శ్రీవల్లి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు జట్టులో చోటు ఇచ్చారు.
హైదరాబాద్ టీమ్‌కు శ్రీవల్లి ఎంపిక కావడంపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావుతో పాటు తల్లిదండ్రులు కట్టా ఉమా, లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడ్పుల గ్రామం. హైదరాబాద్ జట్టుకు ఎంపికైన ఏకైక జిల్లా ప్లేయర్‌గా శ్రీవల్లి నిలువడం విశేషం.