Irani Cup : ఇరానీ కప్లో విదర్భ యువ పేసర్ యశ్ ఠాకూరు చెలరేగాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ నాలుగు కీలక వికెట్లు (4-66) పడగొట్టాడు. దాంతో ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేసిన విదర్భ.. మూడో రోజు ఆట ముగిసే సరికి 224 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు పెవిలియన్ చేరగా.. ధ్రువ్ షొరే (24 నాటౌట్), డానిష్ మలేవార్(16 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
నాగ్ఫూర్లోని వీసీఏ స్టేడియంలో విదర్భ బౌలర్ల ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా కుప్పకూలింది. తొలి వికెట్కు 52 పరుగుల శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. కెప్టెన్ రజత్ పాటిదార్(66), అభిమన్యు ఈశ్వరన్(52)లు రాణించగా.. యశ్ ఠాకూర్ విజృంభణతో ఆ జట్టు214కే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో అథర్వ తైడే(143) మారథాన్ ఆటతో ఆదుకోగా.. యశ్ రాథోడ్(91) మెరవగా విదర్భ 312 రన్స్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ (3-51), సరన్ష్ జైన్(2-94)లు రాణించారు.
4⃣,4⃣,🇼
An action packed passage 🔥
Yash Thakur makes a strong comeback against Ruturaj Gaikwad 💪
Scorecard ▶️ https://t.co/DEPrpRoa7a@IDFCFIRSTBank | #IraniCup pic.twitter.com/nfF5Xj1NLJ
— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2025
రెండో ఇన్నింగ్స్లో విదర్భకు మానవ్ సుతార్ ఆదిలోనే షాకిచ్చాడు. తైడేను అతడు పెవిలియన్ పంపగా.. కాసేపటికే గుర్నూర్ బ్రార్ ఓవర్లో అమన్ మొఖాడే (37) వెనుదిరిగాడు. ఆ తర్వాత ధ్రువ్ షొరే (24 నాటౌట్), డానిస్ మలేవార్(16 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.