Dhruv Jurel : నిరుడు ఇంగ్లండ్‌పై అరంగేట్రంలోనే అర్ధ శతకంతో మెరిసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఈసారి శతకగర్జన చేశాడు. రాంచీ టెస్టులో అసమాన పోరాటంతో జట్టును గట్టెక్కించిన అతడు అహ్మదాబాద్‌లో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు తాను సరిపోతానని చాటాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించి రాబట్టిన ఈ సెంచరీని భారత సైన్యానికి అంకితమిచ్చాడు.
అర్ధ శతకం తర్వాత తండ్రి నేమ్ చంద్ జురెల్‌కు సెల్యూట్ చేసిన జురెల్.. మూడంకెల స్కోర్‌కు చేరుకోగానే ఆర్మీకి సెల్యూట్ చేశాడు. ‘హాఫ్ సెంచరీ సాధించాక మా నాన్నకు సెల్యూట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నా. కానీ, టెస్టుల్లో తొలి సెంచరీని భారత సైన్యానికి అంకితమివ్వాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఈ రోజు అది సాధ్యమైంది. నాన్న సైన్యంలో పనిచేశారు. అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీతో అనుబంధం ఉంది. మేము మైదానంలో పోరాడేది.. వాళ్లు సరిహద్దుల్లో చేసే పోరాటానికి చాలా తేడా ఉంటుంది. సైన్యంలో పోల్చుకోవడం సరికాదు కూడా. నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది’ అని జురెల్ వెల్లడించాడు. అతడి తండ్రి నేమ్ సింగ్ కార్గిల్ యుద్ధ వీరుడు.
What a special knock that was! 🫡
Dhruv Jurel walks back for 125 and after a 206-run stand with Ravindra Jadeja 🔝
Updates ▶️ https://t.co/MNXdZcelkD#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @dhruvjurel21 pic.twitter.com/Zzjcn1viA3
— BCCI (@BCCI) October 3, 2025
అహ్మదాబాద్ టెస్టులో జురెల్ అద్భుతంగా రాణిచాడు. కేఎల్ రాహుల్(100)తో అనంతరం రవీంద్ర జడేజా(104 నాటౌట్)తో కీలక భాగస్వామ్యాలు నెలక్పొడు. రాహుల్ వెనుదిరిగాక.. ఐదో వికెట్‌కు జడజాతో కలిసి 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడీ చిచ్చరపిడుగు. దాంతో, రెండో రోజు ఆటముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 రన్స్ చేసింది. ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన మ్యాచ్‌పై పట్టుబిగించింది.
Hundreds galore 💯
KL Rahul’s 1⃣0⃣0⃣, Dhruv Jurel’s 1⃣2⃣5⃣, and Ravindra Jadeja’s 1⃣0⃣4⃣* leads #TeamIndia‘s charge!#INDvWI | @IDFCFIRSTBank | @klrahul | @dhruvjurel21 | @imjadeja pic.twitter.com/CProc5qzcL
— BCCI (@BCCI) October 3, 2025