అమరావతి : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో జలాశయం 10 గేట్లను 20 అడుగుల వరకు ఎత్తి స్పిల్‌వే (Spillway ) ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు చేరింది.
ప్రాజెక్టు సామర్ద్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204. 35 టీఎంసీల వరకు నీరు నిలువు ఉందని అధికారులు వివరించారు. శ్రీశైలం కుడి, ఎడమ (Left and Right Canals) జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 64,338 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ (Nagarjunasagar) జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది.
ఈ ప్రాజెక్టుకు 3,54,831 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా 22 గేట్లు ఎత్తి 3,14,761 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను 585.40 అడుగులకు వరకు నీరు వచ్చి చేరింది. జలాశయం సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను 298.58 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 22 గేట్ల ద్వారా దిగువకు నీరు.. వీడియో