హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పీరీల పండుగలో పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో నిర్వహించించిన పీరీల పండుగ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మఠికీలు సమర్పించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు.