మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Sridhar Babu vs Gaddam Vamsi | పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య వివాదం మరింత ముదురుతోంది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే తమను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఎంపీ వంశీకృష్ణ అనుచరులు గాంధీభవన్‌లో పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
Sridhar Babu vs Gaddam Vamsi | పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య వివాదం మరింత ముదురుతోంది. మంథని నియోజకవర్గ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న సస్పెన్షన్ల వ్యవహారం ఇప్పుడు పార్టీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే తమను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఎంపీ వంశీకృష్ణ అనుచరులు గాంధీభవన్‌లో పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
మల్లారం గ్రామంలో నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏమిటని బాధిత నాయకులు ప్రశ్నించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు లేఖ రాశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, తమ వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తమకు సస్పెన్షన్ విషయాన్ని తెలియజేస్తూ.. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారని లేఖలో ఆరోపించారు. స్థానిక రాజకీయాలు, తప్పుడు సమాచారంతోనే తమపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తూ, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న అసలైన కార్యకర్తలను సస్పెండ్ చేయడం సరికాదని వంశీకృష్ణ అనుచరులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని తమపై విధించిన సస్పెన్షన్లను రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాలని మహేశ్ కుమార్ గౌడ్‌ను కోరారు. ఈ ఫిర్యాదుతో మంథని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

