Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ కోతల కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ కోతల కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో ఎండిపోయిన వరి పంట పొలాలను ఆయన సందర్శించారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఎదుట వాపోయారు. రైతుబంధు పథకం కింద పూర్తిస్థాయిలో సాయం అందలేదని, కేవలం ఒక్క ఎకరానికే డబ్బులు వేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా బోగస్ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికైనా రుణమాఫీ కాలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇతగబచ్చిన హామీలను నమ్మి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు వద్ద పేర్కొన్నట్లు బీఆర్ఎస్ వెల్లడించింది.
ఈ సందర్భంగా హరీశ్ రావు రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని, రానున్న రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరించేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులను విడుదల చేయడంతోపాటు రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కరెంటు కోతలతో
వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంట పొలాలు.నేడు నర్సాపూర్ ఎమ్మెల్యే @sunitavakiti గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో ఎండిపోయిన వరి పంట పొలాలను సందర్శించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డ అన్నదాతలు.
రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్న రైతులు.
రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేసిన రైతన్నలు.
రైతన్నలు అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.
ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు.
— BRS Party (@BRSparty) November 6, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

