Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 7 : దేవాదాయ, పోలీస్, కార్పొరేషన్, సింగరేణి తదితర అన్ని శాఖల సహకారంతోనే శ్రీరామ నవమి ఉత్సవాలు విజయవంతమయ్యాయని గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం కమిటీ చైర్మన్ గట్ల రమేష్ తెలిపారు. ఆలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీరామ నవమి సందర్భంగా కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ, ఈఈ రామన్, ఏఈ రాంజీ, మునిసిపల్ సిబ్బంది, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డితోపాటు సామాజిక కార్యకర్తలు, ఆలయ ఈవో, పూజారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, దేవాదాయ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.