హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) గెలుపు బాట పట్టింది. మంజేరిలోని పయ్యానంద్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన పోరులో శ్రీనిధి ఎఫ్‌సీ 1-0 తేడాతో గోకులం కేరళ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
మ్యాచ్ 54వ నిమిషంలో ఫాబ్రైస్ కా జట్టు తరఫున ఏకైక గోల్ చేశాడు. చాన్మారి ఎఫ్‌సీతో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి నుంచి పుంజుకున్న శ్రీనిధి తప్పులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు చీఫ్ కోచ్ కార్లోస్ వాజ్పింటో పేర్కొన్నాడు.