మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లతో నిండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే, చాలామంది వీటిని రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, వర్షాకాలంలో మొలకలు త్వరగా పాడైపోతాయి. రెండుమూడు రోజులు అలాగే వదిలేస్తే..
వీటిపై ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. వాటిని తింటే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే, వానకాలంలో మొలకలను పచ్చిగా తినడానికి బదులుగా.. ఉడకబెట్టి తీసుకోవాలి. ఇక చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటే.. నోటికీ రుచిగా ఉంటుంది.