కారేపల్లి, సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల గాంధీనగర్లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లతో పాటు, జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అందుబాటులో ఉన్న సీట్లను కూడా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 5 నుండి 9వ తరగతి వరకు ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష (CET)కు హాజరై ఉండాలని సూచించారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కౌన్సెలింగ్కు హాజరై, అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లను బట్టి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ప్రవేశానికి అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. 5వ తరగతిలో 5 సీట్లు, 7వ తరగతిలో 4 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు, 9వ తరగతిలో 3 సీట్లు, ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీలో ఖాళీల ఆధారంగా భక్తి చేయనున్నట్లు వివరించారు. స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 26న గాంధీ నగర్ పాఠశాల/కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.