Siricilla | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 11 : తంగళ్ళపల్లి మండల కేంద్రంలోనీ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(సిరిసిల్ల)లో స్పాట్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.జయ కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థినులు కళాశాలలో అందుబాటులో ఉన్న బీఏ(హెచ్ఈపీ), బీజడ్సీ, ఎంబీజడ్సీ, బీకాం (సీఏ), ఎంపీసీఎస్ గ్రూపులలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ సాగుతోందని, అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. కళాశాలలో విద్యార్థులకు ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ అవకాశాలతో పాటు వృత్తి విద్యా కోర్సులు, ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రవేశాల కోసం సెల్ నంబర్లు , 998560 7074,9550267058 సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.