రామగిరి, సెప్టెంబర్ 11 : పాఠశాల దశలోనే బాల శాస్త్రవేత్తల తయారీకి సైన్స్ సెమినార్స్ దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి అన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూర్ ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నల్లగొండ డైట్లో ‘క్వాంటమ్ ఏజ్’ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సెమినార్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులో సృజన్మాతకత వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
ఈ పోటీలకు అన్ని మండల్లాలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ప్రథమ స్థానంతో పాటు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందచేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు ఈ నెల 18న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెమినార్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ఎన్జీ కళాశాల భౌతిక శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ మారెడ్డి శ్రీనివాన్రెడ్డి, వివిధ పాఠశాల గైడ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– జిల్లా ప్రథమ స్థానం షఫియా కౌసర్. 10వ తరగతి, కృష్ణవేణి టాలెంట్ ఉన్నత పాఠశాల, దేవరకొండ
– ద్వితీయ స్థానం ఎం.అక్షర. 9వ తరగతి జడ్పీహెచ్ఎస్ బోడంగిపర్తి, చండూర్ (మం).
Ramagiri : బాల శాస్త్రవేత్తల తయారీకి సైన్స్ సెమినార్స్ దోహదం : వనం లక్ష్మీపతి