ముంబై : గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం బయటి చక్రం ఒకటి ఊడిపోవడంతో శుక్రవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది. అయినా విమానం తన ప్రయాణాన్ని కొనసాగించింది. దీంతో ముంబై విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సా
యంత్రం 3.51 గంటలకు విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. విమానంలోని 75 మంది ప్రయాణికులు , సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు.