న్యూఢిల్లీ : కుమార్తె వివాహానికి అయ్యే సమంజసమైన ఖర్చులను భరించడం తండ్రి సహజ కర్తవ్యమని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. దంపతులకు విడాకుల మంజూరును సమర్థిస్తూ, కుమార్తె పెళ్లి కోసం రూ.10 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. భార్యతో విభేదాలతో సంబంధం లేకుండా తండ్రిగా ఇది నెరవేర్చవలసిన కర్తవ్యమని పేర్కొంది.
కుటుంబ న్యాయస్థానం 2019లో మంజూరు చేసిన విడాకుల డిక్రీలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుత కేసులో భార్య తన ఇద్దరు పిల్లలను తన సొంతంగానే పెంచి పోషించారని గుర్తు చేసింది.