అమరావతి : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లను ( Special Trains) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) అధికారులు వెల్లడించారు. తిరుపతి -హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 ప్రత్యేక రైళ్లు, కాచిగూడ-తిరుపతి మధ్య ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ప్రకటించారు.
నరసాపూర్- తిరువణ్ణమలైకు బుధ, గురువారాల్లో 16 రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వివరించారు. ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు వివిధ రోజుల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.