న్యూఢిల్లీ, జూన్ 6: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. పాత మాడల్ నుంచి కొత్త మాడల్కు అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యే ఫైనాన్స్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంతో మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారాకు అప్గ్రేడ్ అయ్యేవారికి రూ.9,999 ఈఎంఐతో రుణాలు మంజూరు చేస్తున్నది.
ప్రస్తుతం స్టాండర్డ్ ఫైనాన్స్ స్కీంల కంటే 20 శాతం తక్కువకే ఈఎంఐని అందిస్తున్నట్టు మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. ఐదేండ్లు లేదా 75 వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ కారును తిరిగి ఇచ్చే అవకాశం కొనుగోలుదారుడికి కల్పించింది. ఈ కారు రిటర్నులో వాహన ధరలో 50 శాతం తిరిగి చెల్లించనున్నది.