తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో ( Tirumala ) మార్చి మాసంలో జరుగునున్న విశేష కార్యక్రమాల వివరాలను టీటీడీ ( TTD ) అధికారులు విడుదల చేశారు. మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు.
10న మతత్రయ ఏకాదశి, 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, 14న కుమారధారతీర్థ ముక్కోటి, 25న సర్వ ఏకాదశి ( Ekadasi ), 26న అన్నమాచార్య వర్థంతి, 28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య, 30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ( Ugadi ) , శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్నస్వామివారిని 62,323 మంది భక్తులు దర్శించుకోగా 20,460 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 2.92 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.