ఇప్పుడు ఎవరి నోట విన్నా సామి సామి పాటనే వినిపిస్తున్నది. పుష్ప సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్లో పెట్టిన రెండు వారాల్లోనే 34మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంత ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు. మరి ఈ పాట పాడింది ఎవరో తెలుసా? మన తెలంగాణ బిడ్డ, ఫోక్ సింగర్ మౌనిక యాదవ్.. మరి ఆమెకు ఈ సినిమాలో పాటపాడే అవకాశం ఎలా వచ్చింది.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి..? ఇంత పెద్ద సినిమాలో ఓ హిట్ సాంగ్ పాడుతానని తాను అనుకుందా? ఇలాంటి ఆసక్తికర విషయాలను మౌనికయాదవ్ నమస్తే తెలంగాణతో పంచుకుంది. మరెందుకాలస్యం ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి..