చౌటుప్పల్, మార్చి 27 : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ కో సం ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ ప రీక్షకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. మున్సిపాలిటీ కేంద్రంలోని మాతృశ్రీ, గాయత్రి కళాశాలల్లో నిర్వహించిన పరీక్షకు 600మంది హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నప్రతాన్ని అందజేశారు. మొత్తం 200మార్కులకు గాను 75మార్కులు సాధించిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
నియోజకవర్గంలోని ఉద్యోగార్థులకు తనవంతు తోడ్పాటు అందించేందుకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు ఉన్నారు.