రామగిరి, జూలై 24 : నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లో గల శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఛాయా సోమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకుడు ఉదయ్ కుమార్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ శర్మ, పోలీస్ అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.