షార్జా: ఐసీసీ టోర్నీలో దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికాకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది! నాకౌట్ దశకు చేరాలంటే.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి కాగా.. సఫారీలంతా కలిసికట్టుగా విజృంభించి ఇంగ్లండ్‌పై విజయం సాధించినా.. సెమీస్‌కు కావాల్సిన రన్‌రేట్‌ను మాత్రం చేరుకోలేకపోయారు. ఫలితంగా గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా నాకౌట్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సమంగా నిలిచినా.. రన్‌రేట్‌లో సఫారీల (0.739) కంటే ముందున్న కంగారూలు (1.216) సెమీస్‌లో అడుగు పెట్టారు.
శనివారం జరిగిన సూపర్-12 చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మార్క్మ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. భారీ స్కోరు చేసిన సఫారీలు.. ఇంగ్లిష్ ఆటగాళ్లను 131 పరుగుల లోపు కట్టడి చేస్తే.. నాకౌట్‌కు చేరే చాన్స్ ఉన్నా.. అది సాధ్యపడలేదు. ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మోయిన్ అలీ (37) టాప్ స్కోరర్. ఆఖరి ఓవర్లో ఇంగ్లిష్ జట్టు విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. రబడ హ్యట్రిక్ పడగొట్టి సఫారీలకు ఓదార్పు విజయాన్నందించాడు. క్రిస్ వోక్స్ (7), మోర్గాన్ (17), జోర్డాన్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. డసెన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్ (బి) అలీ 2, డికాక్ (సి) రాయ్ (బి) రషీద్ 34, డసెన్ (నాటౌట్) 94, మార్క్మ్ (నాటౌట్) 52, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 189/2. వికెట్ల పతనం: 1-15, 2-86, బౌలింగ్: అలీ 4-0-27-1, వోక్స్ 4-0-43-0, రషీద్ 4-0-32-1, జోర్డాన్ 4-0-36-0, వుడ్ 4-0-47-0.
ఇంగ్లండ్: రాయ్ (రిటైర్డ్‌హర్ట్) 20, బట్లర్ (సి) బవుమా (బి) నోర్జే 26, అలీ (సి) మిల్లర్ (బి) షంసీ 37, బెయిర్‌స్టో (ఎల్బీ) షంసీ 1, మలాన్ (సి) రబడ (బి) ప్రెటోరియస్ 33, లివింగ్‌స్టోన్ (సి) మిల్లర్ (బి) ప్రెటోరియస్ 28, మోర్గాన్ (సి) కేశవ్ (బి) రబడ 17, వోక్స్ (సి) నోర్జే (బి) రబడ 7, జోర్డాన్ (సి) మిల్లర్ (బి) రబడ 0, రషీద్ (నాటౌట్) 2, వుడ్ (నాటౌట్) 1, మొత్తం: 20 ఓవర్లలో 179/8. వికెట్ల పతనం: 1-58, 2-59, 3-110, 4-145, 5-165, 6-176, 7-176, 8-176, బౌలింగ్: కేశవ్ 3-0-23-0, నోర్జే 4-0-34-1, రబడ 4-0-48-3, షంసీ 4-0-24-2, మార్క్మ్ 2-0-18-0, ప్రెటోరియస్ 3-0-30-2.