కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు ముందస్తు జాగ్రత్తగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ప్రజలలో దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ పంజాబ్ లోని అమృత్ సర్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుటుంబ సభ్యులు పెద్ద వాళ్లలో అవగాహన కల్పించాలని అని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసిన సోనూసూద్ ప్రస్తుతం ప్రజల గుండెలలో దేవుడిగా కొలవబడుతున్నాడు. అతని సేవా కార్యక్రమాలకు రాజకీయ నాయకులు సైతం ఫిదా అయ్యారు. వలస కార్మికులతో పాటు విదేశాలలో చిక్కుకున్న భారతీయులకి ఎంతో సాయం చేసిన సోనూసూద్ ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. అతని ప్రయత్నానికి ప్రశంసలు లభిస్తున్నాయి.
Coming to you for your vaccination.
— sonu sood (@SonuSood) April 7, 2021
Biggest vaccination drive begins. pic.twitter.com/yqUx8A9PYy