రియల్ హీరో మరో సాయం.. చికిత్స కోసం ఏయిర్ అంబులెన్స్
సోనుసూద్ | గతేడాది కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్.
న్యూఢిల్లీ : గతేడాది కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దైవంగా మారాడు సోనూసూద్. నాటి నుంచి సాయం కోరిన వారందరినీ ఆదుకుంటూ వస్తూ రియల్ హీరోగా నిలిచాడు. తాజాగా కరోనా సోకి ఊపిరితిత్తులు దెబ్బతిన్న యువతిని చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు. నాగ్‌పూర్‌కు చెందిన భారతి (25) అనే యువతి కరోనా బారినపడగా.. 85-90 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. స్థానిక వోక్హార్డ్ట్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదంటే, ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని, ఈ సదుపాయం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న సోనుసూద్ వెంటనే అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లను సంప్రదించారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ థెరపీ (ఈసీఎంఓ) సహాయంతో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయొచ్చని, తద్వారా ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించొచ్చని తెలుసుకున్నారు. డాక్టర్లకు భారతి పరిస్థితిని వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఆరుగురు వైద్యుల బృందం ఈసీఎంఓ పరికరాలతో నాగ్‌పూర్‌కు రాగా.. వారి కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
అనంతరం భారతిని హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతోంది. దీనిపై సోనుసూద్ స్పందిస్తూ అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతోందని చెప్పారు. త్వరలోనే కోలుకొని తిరిగి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారతి తండ్రి రైల్వే రిటైర్డ్ అధికారి. ఆపత్కాలంలో అండగా నిలిచిన సోనుసూద్‌కు యువతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన సోనుసూద్.. శుక్రవారం నెగెటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇది నేషనల్ ఎమర్జెన్సీ
డబుల్ మాస్కుతో డబుల్ రక్షణ
ఆక్సిజన్‌కు ఎందుకింత కష్టం?
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
దేశంలో కొవిడ్ పరిస్థితిపై నేడు ప్రధాని వరుస సమీక్షలు
మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 3.32 లక్షల కేసులు
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
మహారాష్ట్ర ఘటనపై ప్రధాని, రక్షణ మంత్రి సంతాపం
వ్యాక్సిన్ ధరల్లో ఏకరూపత ఉండాలి : మాయావతి
పాక్‌కు వెళ్లొచ్చిన 200 మందికి కరోనా
ప్లాంట్ లేకపోతే ఆక్సిజన్ అందదా? : ప్రధానితో ఢిల్లీ సీఎం
కేంద్రమే బాధ్యత వహించాలి : రాహుల్ గాంధీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


