Sonia Gandhi | న్యూఢిల్లీ, డిసెంబర్ 8: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికాకు చెందిన జార్జ్ సొరోస్ ఫౌండేషన్ నిధుల సాయంతో నడిచే ఎఫ్డీఎల్-ఏపీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే ఆలోచనకు సొరొస్ ఫౌండేషన్ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ తెలిపింది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని ఈ సంస్థ తెలియజేస్తున్నదని తన వరుస ఎక్స్ పోస్ట్‌లో బీజేపీ వెల్లడించింది.
తమ పార్టీ ఆరోపణలను అమెరికా ప్రభుత్వం ఖండించడంపై రాహుల్ గాంధీకి లోక్‌సభలో పది ప్రశ్నలు సంధిస్తానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు. సోనియా గాంధీ సహాధ్యక్షురాలిగా ఉన్న ఫోరమ్ ఫర్ ది డెమొక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్(ఎఫ్డీఎల్-ఏపీ)కి జార్జ్ సొరోస్ ఫౌండేషన్ నిధులు ఇచ్చే సంస్థతో సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు సోనియా గాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సొరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ఉందని.. బీజేపీ విమర్శించింది.