పనాజీ: హర్యానాకు చెందిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ కన్నమూశారు. గోవా టూర్లో ఉన్న ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. బిగ్ బాస్ 14లో ఆమె చివరిసారి కనిపించారు. వైల్డ్‌కార్డ్ తో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పాపులర్ స్టారయ్యారు. సోనాలికి ఒక కూతురు ఉన్నది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది.
టిక్‌టాక్‌లోనూ సోనాలికి పాపులారిటీ ఉంది. ఏక్ మా జో లాకోం కి లియే బనీ అమ్మా అనే టీవీ సీరియల్లో నటించింది. కొన్ని హర్యానా చిత్రాల్లో నటించారు. పంజాబీ, హర్యాన్వీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆమె కనిపించింది. ద స్టోరీ ఆఫ్ బద్మాష్‌ఘర్ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ 2016లో అనుమానాదస్ప రీతిలో తన ఫామ్‌హౌజ్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.