యూపీలో మా అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తోంది… మమ్మల్ని చూసి భయపడుతోంది: సంజయ్ రౌత్

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల్లో కొందరిని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ తమ పార్టీ అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తున్నదని అన్నారు. తమను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు సమయానికి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ శివసేన అభ్యర్థుల నామినేషన్ సస్పెండ్ చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. దీనిపై చర్య తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి సిద్ధంగా లేరని, ఆయన ఒత్తిడిలో ఉన్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాను ఢిల్లీలో ఈసీని కలుస్తానని మీడియాతో అన్నారు.
కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన శివసేన తొలిసారి ఆ రాష్ట్రం బయట ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాను, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

