వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
- మంత్రి హరీశ్ రావుకు మెడికల్ ఎంప్లాయీస్ వినతి

హిమాయత్‌నగర్, నవంబర్ 23: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు, వైద్య కళాశాల్లో పని చేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావును తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి బృందం ఆయన నివాసంలో కలిసి వినతి ప్రతాన్ని అందజేసింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీంరావు మాట్లాడుతూ దవాఖానలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యో గాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేసేందుకు చొరవ చూపాలని కోరారు. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించి కొత్త పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ నాయకులు యంసీఎస్ రాజు, యం.యాదయ్య, వి.వేణు కుమార్, వెంకట్రావు, ఈరోజి, ఇందిరాశ్రీలక్ష్మి, మధుసూదన్‌రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, సంతోష్ కుమార్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

